News
బ్యాంకులకు వరుస సెలవులు
పెద్దనోట్లు రద్దు నేపథ్యంలో గత 30 రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు మూడురోజులు బ్యాంకుల సెలవులతో మరిన్ని కష్టాలు రానున్నాయి. వచ్చే శనివారం రెండవ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. అలాగే ఆదివారం సాదారణ సెలవు, సోమవారం షిల్లార్-ఉల్-నబీ ముస్లీంల పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు. రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు అనంతరం ఈ రోజుకాకుంటే రేపైనా కరెన్సీ కష్టాలు తీరుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే నోట్లును రద్దుచేసి 30 రోజులు పూర్తి అయినప్పటికీ కరెన్సీ కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. గోరుచుట్టుపై రోకలి పోటు చందాన బ్యాంకులకు వరుస సెలవులు వచ్చిపడ్డాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఏటీఎంలు 90 శాతం పై బడి పనిచేయడం లేదు. ఈ పరిస్థితులల్లో మూడు రోజుల పాటు బ్యాంకులూ లేక, ఏటీఎంలు పనిచేయక కరెన్సీ కష్టాలు ఎలా తీరుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గురు,శుక్రవారాల్లోనైనా బ్యాంకుల నుంచి సరిపడ చెల్లింపులు ఇవ్వాలని కోరుతున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








